Quantcast
Channel: Hair Growth – Tips And Tricks | StyleCraze
Viewing all articles
Browse latest Browse all 2609

జుట్టు రాలడాన్ని అరికట్టడానికి ఇంటి చిట్కాలు మరియు చికిత్స – Hair Fall Tips and Treatment at Home in Telugu

$
0
0

అందమైన, ఆరోగ్యకరమైన, ఒత్తయిన జుట్టు కావాలని అందరూ కోరుకుంటారు. అందమైన జుట్టు నలుగురిలో మిమ్మల్ని ప్రత్యేక ఆకర్షణగా నిలుపుతుంది.

చాలా మందికి జుట్టు రాలడం, పల్చబడడం ఇప్పుడు సాధారణం అవుతోంది. మనం వాడే హానికారక షాంపూలూ, రంగుల వల్ల జుట్టు మీద ఎంతో ప్రభావం పడుతోంది.

మన జుట్టును ఎలా కాపాడుకోవాలి? పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతులు పాటించాలా లేక మందులు వాడాలా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఇది మీరు తప్పక చదవాలి!

జుట్టు రాలడానికి కారణాలు – Causes of Hair Fall in Telugu

జుట్టు అధికంగా రాలుతుంటే అది బట్టతలకు దారితీయొచ్చు. కొంతమందికి శరీరం పై జుట్టు కూడా రాలిపోవచ్చు.  కొన్ని కారణాల వల్ల జుట్టు రాలడం అధికమవుతుంది. అవి:

  • వయసు మీద పడటం
  • అధిక ఒత్తిడి
  • బరువు చాలా ఎక్కువగా తగ్గడం
  • డయాబెటిస్(మధుమేహం) మరియు ల్యూపస్ వంటి వ్యాధులు
  • వంశపారంపర్యంగా బట్టతల ఉండడం.
  • గర్భం ధరించడం, థైరాయిడ్  సమస్యలు, మెనోపాజ్ వంటి హార్మోన్లలో సంభవించే మార్పులు
  • తామర వంటి అనారోగ్యాలు
  • క్యాన్సర్, మోకాళ్ళ నొప్పులు, గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి అనారోగ్యాల చికిత్సకు వాడే మందులు.
  • రేడియేషన్ థెరపీ
  • జుట్టుని గట్టిగా బిగించి కట్టడం,  కొన్ని రకాల హెయిర్ స్టైల్స్ చేసుకోవడం
  • పర్మినెంట్ స్ట్రైట్నింగ్, బ్లో డ్రయ్యింగ్, కర్లింగ్

జుట్టు  రాలుతున్న వారిలో ఈ క్రింది లక్షణాలలో కొన్ని కనపడవచ్చు:

  • రానురాను జుట్టు సన్నబడి పోతూ ఉండటం
  • అక్కడక్కడ పాచెస్ పాచెస్ గా రాలిపోవడం
  • శరీరంపై జుట్టు రాలిపోవడం
  • తలపై గల చర్మంపై పొలుసులు గల పాచెస్

జుట్టు రాలడానికి గల కారణాలను బట్టి అందరికీ ఒకేలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు. పై లక్షణాలలో ఏదైనా కనిబడగానే  మీ వైద్యులని సంప్రదించడం అత్యుత్తమమైన పని.

జుట్టు రాలడాన్ని అరికట్టడానికి ఇంటి చిట్కాలు –  Home Remedies for Hair Fall in Telugu

1. కొబ్బరి పాలు

Coconut milk

Shutterstock

దీనిలోని ప్రోటీన్లు, జుట్టుకు అవసరమైన కొవ్వులు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.

కొబ్బరి పాల తయారీ మరియు వాడే విధానం

  • ఒక కొబ్బరికాయను తురిమి, పాన్లో ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి వేడిచేయండి.
  • ఈ కొబ్బరి తురుముని మిక్సీలో వేసి బాగా రుబ్బండి.
  • వడకట్టి చల్లబరచండి.
  • తరువాత ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, మెంతి పొడులను  ఈ పాలలో కలపండి.
  • మీ నెత్తి మరియు జుట్టు మీద బాగా అప్లై చేయండి.
  • 20 నిమిషాల తరువాత, షాంపూతో శుభ్రం చేసుకోండి.

2. వేప

వేప లోని అత్యధిక స్థాయిలో ఉండే ఫాటీ ఆసిడ్  జుట్టుకు ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన జుట్టు యొక్క ప్రధాన అవసరాలలో ఒకటి, ఆరోగ్యకరమైన చర్మం. ఇక్కడ వేప ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా జుట్టు సన్నబడటం మరియు బట్టతల పెరగడం వంటి వాటితో బాధపడుతున్న వారికి ఇది దివ్యౌషధం. అదనపు సెబమ్ (ఆయిల్) ఉత్పత్తి జుట్టు రంధ్రాలనకు అడ్డుపడటం నెత్తిమీద మంటను పెంచుతుంది. ఇది మీ మూలాలను దెబ్బతీసి జుట్టును బలహీనపరుస్తుంది. వేప నీటితో జుట్టును కడగడం దీన్ని అరికట్టడానికి సహాయపడుతుంది. నెత్తిమీద ఉండే రంధ్రాలను శుభ్రపరిచి జుట్టు పెరుగుదలను పెంచుతుంది.

వేప నీరు వాడే విధానం

  • తాజా వేప ఆకులను దాదాపు రెండు కప్పుల నీటిలో ఉడకబెట్టండి.
  • నీరు ఆకుపచ్చగా మారడాన్ని మీరు గమనించవచ్చు.
  • షాంపూ చేసుకున్న తర్వాత మీ జుట్టును ఈ నీటితో కడగండి.
  • దీనిలోని యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాల వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అంతేకాక జుట్టు పెరుగుదలను కూడా ప్రేరేపిస్తుంది.

3. మెంతులు

మెంతులలో జుట్టు పెరుగుదలను పెంచే లక్షణాలు ఉన్నాయి. ఇది జుట్టు రాలడాన్ని గణనీయంగా తగ్గించడమే కాక, కొత్త జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది (1).

మెంతులు వాడే విధానం

  • అర కప్పు మెంతి గింజలను రాత్రిపూట నీటిలో నానబెట్టండి.
  • మరుసటి రోజు ఉదయం నానబెట్టిన మెంతి గింజలను మెత్తగా రుబ్బి తలకి రాసుకోండి.
  • 30-60 నిమిషాలు అలాగే ఉంచి నీటితో శుభ్రం చేసుకోండి.
  • దీన్ని వారానికి ఒకసారి చేయవచ్చు.

4. ఎగ్ మాస్క్

కోడి గుడ్డు లో ఉండే పచ్చసొన యొక్క గుణాలు జుట్టు పెరుగుదలకు చాలా చక్కగా ఉపయోగపడతాయి (2).

ఎగ్ మాస్క్ వాడే విధానం

  • పచ్చసొనని బాగా గిలక్కొట్టాలి
  • తలపై బాగా పట్టించి, అరగంట పాటు వదిలేయాలి
  • మంచి సువాసన వచ్చే షాంపూతో శుభ్రంగా కడిగి కండీషనింగ్ చేయాలి.
  • దీన్ని వారానికి ఒకసారి చేయవచ్చు.

5. ఉల్లి రసం

జర్నల్ ఆఫ్ డెర్మటాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం,  ఉల్లిపాయ రసాన్ని ఉపయోగించడం జుట్టు తిరిగి పెరగడానికి సహాయపడుతుంది, ముఖ్యంగా అలోపేసియా అరేటా కేసులలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది (3).

ఉల్లి రసం వాడే విధానం

  • ఉల్లిపాయను ముక్కలు చేసి మిక్సీలో పేస్ట్ చేసి రసాన్ని పిండి పక్కకు తీయాలి.
  • ఆ రసాన్ని తలకు పట్టించి 30-60 నిమిషాలపాటు అలానే ఉంచాలి.
  • ఆ తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
  • దీన్ని వారానికి 1-2 సార్లు చేయవచ్చు.

6. లికోరైస్ రూట్

ఈ ఆయుర్వేద మూలిక జుట్టు రాలడాన్ని అరికట్టి, జుట్టుకు మరింత నష్టం జరగకుండా చేస్తుంది. అంతేకాక చుండ్రును వదిలించుకోవడానికి కూడా సహాయపడుతుంది.

లికోరైస్ రూట్ వాడే విధానం

  • ఒక కప్పు పాలలో ఒక టేబుల్ స్పూన్ లైకోరైస్ రూట్ పొడి, పావు టీస్పూన్ కుంకుమపువ్వు వేసి పేస్ట్ తయారు చేయండి.
  • దీన్ని మీ తల పైన జుట్టుకు అప్లై చేసి రాత్రంతా వదిలివేయండి.
  • మరుసటి రోజు ఉదయం, జుట్టును కడగండి.
  • ఇలా వారానికి రెండుసార్లు చేయండి.

7. గ్రీన్ టీ

Green tea

Shutterstock

గ్రీన్ టీలో ఎపిగాల్లోకాటెచిన్ -3-గాలెట్ (ఇజిసిజి) అనే పాలీఫెనాల్ ఉంటుంది. ఇజిసిజి తలపై ఉండే చర్మ కణాల పెరుగుదలను ప్రేరేపించి జుట్టు రాలడాన్ని అరికట్టడంతో పాటు ఆండ్రోజెనెటిక్ అలోపేసియా చికిత్సకు సహాయపడుతుంది (5).

  • 1 గ్రీన్ టీ బ్యాగ్
  • 1 కప్పు వేడి నీరు
గ్రీన్ టీ వాడే విధానం
  • ఒక కప్పు వేడి నీటిలో గ్రీన్ టీ బ్యాగ్ ఉంచండి.
  • 5-10 నిమిషాలు ఉంచి, వడకట్టండి.
  • కొంచెం చల్లబరచి తాగండి.

గ్రీన్ టీ జుట్టు రాలడాన్ని అరికట్టి, జుట్టు కుదుళ్ళకు బలాన్ని అందిస్తుంది. అలాగే కాస్త గోరువెచ్చని గ్రీన్ టీతో (వేడి నీళ్లతో ఒక రెండు గ్రీన్ టీ బ్యాగులు వేసి తయారు చేయండి) మీ జుట్టును మర్దన చేసి తర్వాత తలస్నానం చేయండి.

8. బీట్‌రూట్ ఆకుల జ్యూస్

బీట్‌రూట్ లోని విటమిన్ సి, బి 6, ఫోలేట్, మాంగనీస్, బీటైన్, పొటాషియం జుట్టు పెరుగుదలకు అవసరం. అంతేకాకుండా, బీట్‌రూట్ తలను శుభ్రంగా ఉంచుకోవడానికి  సహాయపడుతుంది.

బీట్‌రూట్ ఆకులను వాడే విధానం

  • 7-8 బీట్‌రూట్ ఆకులను ఉడకబెట్టి 5-6 గోరింట ఆకులతో కలిపి రుబ్బుకోవాలి.
  • ఈ మిశ్రమాన్ని మీ తలకి పట్టించి 15-20 నిమిషాలు తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

9. మందారం

మందార ఆకులు, పువ్వులు జుట్టు పెరుగుదలకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఇవి జుట్టు రాలడాన్ని ఎదుర్కోవటానికి కూడా ఉపయోగించవచ్చు (6).

మందారం వాడే విధానం

  • మందార పువ్వులు మరియు ఆకులను కలిపి రుబ్బండి.
  • ఈ మిశ్రమానికి కొద్దిగా కొబ్బరి నూనెను కలపండి .
  • దీన్ని మీ తల మరియు జుట్టుకు  పట్టించండి.
  • 30-60 నిమిషాలు తర్వాత షాంపూతో శుభ్రం చేసి, మీ జుట్టును కండిషన్ చేయండి.

10. ఉసిరి నూనె

జుట్టు పెరుగుదలకు ఉసిరి మీకు బాగా ఉపయోగపడుతుంది. ఉసిరి నూనె జుట్టు కుదుళ్ళలో ఉండే చర్మపు కణాలు చురుకుగా విస్తరించడానికి సహాయపడుతుంది.

ఉసిరి నూనె వాడే విధానం

  • ఉసిరి నూనె మీ తలకి బాగా పట్టించి ఒక గంట పాటు అలాగే ఉంచండి.
  • తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకొని కండీషన్ చేయండి.
  • ఇలా వారానికి 1-2 సార్లు చేయవచ్చు.

11. హెన్నా(గోరింటాకు)

హెన్నా జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.గోరింటాకులోని టెలోజెన్ ఎఫ్లూవియం వల్ల కలిగే జుట్టు రాలడానికి చికిత్స చేయడంలో ఇది దాదాపుగా మినోక్సిడిల్ (జుట్టు రాలడానికి చికిత్స చేసే ఔషధం) లా పనిచేస్తుంది (10).

హెన్నా వాడే విధానం

  • గోరింట ఆకులను నీటితో కలిపి చిక్కని పేస్ట్ లా అయ్యేలా రుబ్బండి.
  • ఈ హెన్నా పేస్ట్ ను మీ తలపై రాసుకుని మిగిలిన మిశ్రమాన్ని మీ జుట్టు పొడవు మొత్తానికి పట్టించండి.
  • ఒక గంట పాటు ఉంచుకుని శుభ్రం చేసుకోండి.
  • తాజా ఆకులు అందుబాటులో లేకపోతే మీరు గోరింట పొడి/ హెన్నా పొడిని ఉపయోగించవచ్చు.
  • మీరు వారానికి ఒకసారి ఇలా చేయవచ్చు.

12. కొబ్బరి నూనె

Coconut oil1

Shutterstock

కొబ్బరి నూనె మీ జుట్టు మొదళ్ళలోకి లోతుగా చొచ్చుకుపోతుంది ప్రోటీన్ తగ్గకుండా చేస్తుంది. స్టైలింగ్ మరియు కఠినమైన ఉత్పత్తుల వాడకం వంటి వాటి వల్ల తరచుగా జుట్టు దెబ్బతినకుండా ఉండడానికి ఇది సహాయపడుతుంది (8).

కొబ్బరి నూనె వాడే విధానం

  • కొబ్బరి నూనెను మీ నెత్తిమీద మరియు జుట్టుకు సున్నితంగా మసాజ్ చేయండి.
  • శుభ్రం చేయడానికి ముందు కనీసం గంటసేపు అలాగే ఉంచండి.
  • షాంపూతో శుభ్రం చేసుకోండి.
  • ఇలా వారానికి కనీసం రెండుసార్లు చేయవచ్చు.

13. కలబంద (అలోవెరా)

అలోవెరా జుట్టు రాలడాన్ని తగ్గించే సమర్థవంతమైన ఇంటి నివారణ. దురద, పొరలు పొరలుగా ఉండటం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఇది ప్రభావవంతంగా ఉంటుంది.

కలబంద వాడే విధానం

  • కలబంద గుజ్జుని మీ తలకి బాగా పట్టించి, సుమారు 45 నిమిషాలు అలాగే ఉంచండి.
  • సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి.
  • మంచి ఫలితాల కోసం ఇలా వారానికి 3-4 సార్లు చేయవచ్చు.

14. నిమ్మరసం

నిమ్మరసం వాడే విధానం

  • ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ తేనె, నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల పెరుగులను బాగా కలపాలి.
  •  ఈ పేస్ట్ ను చక్కగా జుట్టంతా పట్టించండి.
  • 30 నిమిషాలు అలాగే ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేయండి.
  • వారానికి ఒకసారి ఈ చిట్కాను పాటించండి.

15. పెరుగు

పెరుగు ప్రోబయోటిక్స్ కు గొప్ప మూలం. ఇది మీ జుట్టు చిట్లిపోకుండా కాపాడి, జుట్టు రాలడాన్ని నివారించడానికి ఎంతో సహాయపడుతుంది (9).

జుట్టుని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ప్రతిరోజు ఒక గిన్నెడు పెరుగు తీసుకోవాలి.

16. బంగాళాదుంప/ ఆలుగడ్డ

బంగాళాదుంపలోని విటమిన్ బి, విటమిన్ సి, జింక్, నియాసిన్ మరియు ఐరన్ జుట్టు కుదుళ్లను పోషించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఇది తలను శుభ్రపరచడంలో కూడా బాగా సహాయపడుతుంది.

బంగాళాదుంప వాడే విధానం

  • బంగాళాదుంపను కడిగి తొక్క తీసి మిక్సీలో మెత్తగా రుబ్బండి.
  • రసాన్ని వడగట్టి జుట్టు మొదళ్ళ నుండి  చివర్ల వరకు పట్టించండి.
  • 30 నిమిషాల పాటు అలా వదిలేసి తరువాత షాంపూతో కడిగి కండిషనింగ్ చేయండి.

17. కరివేపాకు

Curry leaf

Shutterstock

కరివేపాకు మీ జుట్టును తెల్లబడకుండా చేయడానికి, జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

కరివేపాకు వాడే విధానం

  • ఒక పాన్లో అర కప్పు కొబ్బరి నూనె, కొద్దిగా కరివేపాకులు వేసి వేడి చేయండి.
  • నూనె నల్లగా అయిన తరువాత, స్టవ్ ఆఫ్ చేసి, చల్లారనివ్వండి.
  • నూనెను వడకట్టి జుట్టు మొత్తానికి పట్టేలా బాగా మర్దనా చేయండి.
  • 30-60 నిమిషాలు అలాగే ఉంచండి.
  • తేలికపాటి షాంపూతో శుభ్రం చేసి, కండీషనింగ్ చేయండి.
  • ఆశించిన ఫలితాలను పొందడానికి ఇలా వారానికి ఒకసారి చేయవచ్చు.

18. కొత్తిమీర రసం

కొత్తిమీర రసం మీ జుట్టు రాలడాన్ని అరికట్టి, జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.

కొత్తిమీర రసం వాడే విధానం

  • మీ జుట్టు బలంగా మరియు పొడవుగా ఉండటానికి, కొత్తిమీర రసాన్ని మీ తలకి రాసుకుని ఒక గంట సేపు ఉంచుకుని షాంపూతో కడిగేయండి.
  • అలాగే, మరింత ప్రభావవంతమైన ప్రయోజనాలకై మీరు ఈ రసానికి ఇతర సహజ పదార్ధాలను కూడా కలపవచ్చు.
  • మంచి ఫలితాల కోసం వారానికి ఒకసారి ఈ చిట్కాని అనుసరించాలి.

19. శీకాకాయ

జుట్టు కుదుళ్లను బలంగా చేసి, జుట్టు రాలడాన్ని అరికట్టడానికి శీకాకాయ సహాయపడుతుంది. ఇది ఫోలికల్-క్లాగింగ్, చుండ్రు మరియు దురద వంటి సమస్యలపై సమర్థవంతంగా పనిచేస్తుంది.

20. తేనె, ఆలివ్ ఆయిల్,  దాల్చినచెక్క ప్యాక్

కావలసిన పదార్ధాలు

  • 2 టేబుల్ స్పూన్ల తేనె
  •  2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్
  • 1 టేబుల్ స్పూన్ తాజా దాల్చినచెక్క పొడి

వాడే విధానం

  • మొదట, 2 టేబుల్ స్పూన్ల తేనెలో 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలపండి.
  • ఇప్పుడు ఈ మిశ్రమానికి 1 టేబుల్ స్పూన్ తాజా దాల్చినచెక్క పొడిని చేర్చి పేస్ట్ లా అయ్యే వరకు కలపండి.
  • ఈ పేస్ట్ ను మీ నెత్తి మీద మరియు జుట్టు  మొదళ్ళనుండి చివర్ల వరకు బాగా పట్టించండి. చేతులతో సున్నితంగా మసాజ్ చేయవచ్చు.
  • 1 గంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
  • ఇలా వారానికి ఒకసారి చేయవచ్చు.

జుట్టు  రాలిపోవడాన్ని అరికట్టడానికి తీసుకోవలసిన ఆహారం – Diet for Hair Fall Treatment in Telugu

జుట్టు రాలడానికి కేవలం పైన చెప్పిన కారణాలు మాత్రమే కాదు,  సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా కారణం అవుతుంది. జుట్టు పెరుగుదలకు అనేక పోషకాలు అవసరం. మీ శరీరానికి అవసరమైన పోషకాలు అందనప్పుడు జుట్టు రాలిపోతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం మరియు వ్యాయామం చేయడం ఎంతో అవసరం. మీ సమతుల్య ఆహారంలో ప్రోటీన్ మరియు ఐరన్ అధికంగా ఉండే ఆహారపదార్ధాలు ఉండాలి. కుదిరినంత వరకు పిజ్జా, బర్గర్, నూనెలో వేయించినవి తీసుకోకపోవడం మంచిది.

జుట్టు  రాలిపోవడాన్ని అరికట్టడానికి తీసుకోవలసిన ఆహారం:

  • ఆకుకూరలు
  • పెరుగు
  • విటమిన్ బి ఎక్కువగా ఉండే ఆహారం
  • పల్లీలు, బాదాం వంటి గింజలు, తృణధాన్యాలు, మరియు కాయధాన్యాలు
  • నారింజ,నిమ్మ, పుచ్చకాయ, టమోటా వంటి పండ్లు
  •  ప్రోటీన్లు అధికంగా ఉండే పాలు,చీజ్,చేపలు, గుడ్లు,చికెన్ వంటి పదార్ధాలు

జుట్టు రాలడాన్ని అరికట్టేందుకు చిట్కాలు – Hair Fall Tips in Telugu

  • కలరింగ్ చేయకండి
  • ధూమపానం మానుకోండి
  • నీరు బాగా త్రాగండి
  • వ్యాయామం / యోగ తప్పక చేయండి.
  •  జుట్టును గట్టిగా కట్టవద్దు.
  • దువ్వెన తరచుగా కడగండి.
  • మీ జుట్టును దువ్వేటప్పుడు, షాంప్పూచేసేటప్పుడు సున్నితంగా చేయండి.
  • కర్లింగ్ ఐరన్స్, హాట్ ఆయిల్ ట్రీట్మెంట్స్ లేదా హాట్ రోలర్స్ వంటి కఠినమైన చికిత్సలను మీ జుట్టు మీద వాడకుండా ఉండండి.
  • జుట్టు రాలడానికి కారణమయ్యే మందులు తీసుకోవడం మానేయండి.
  • మీరు బయటికి వచ్చేటప్పుడు టోపీ లేక స్కార్ఫ్ వంటివాటిని ఉపయోగించడం ద్వారా మీ జుట్టును దెబ్బతీసే సూర్య కిరణాల నుండి రక్షించండి.
  • మీ చర్మ లక్షణాలను బట్టి షాంపూ వాడాలి.
  • మంచి కండీషనర్ వాడకం జుట్టును మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. కండీషనర్ అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది, ఇది దెబ్బతిన్న జుట్టును సరిచేయడానికి సహాయపడుతుంది.
  • జుట్టుకు నూనె రాయడం. నూనె రక్త ప్రసరణకు సహాయపడుతుంది మరియు మూలాలను పెంచుతుంది. మీ నెత్తికి సరిపోయే నూనెతో వారానికి ఒకసారి మీ జుట్టుకు మసాజ్ చేసుకోండి. దీన్ని షవర్ క్యాప్‌తో కప్పి, రెండు గంటల తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి.
  • స్టైలింగ్ ఉత్పత్తులను మానుకోండి మరియు బదులుగా సహజంగా ఇంట్లో తయారుచేసిన ప్యాక్‌ల వాడకాన్ని పెంచండి.

మీకు చక్కని, ఆరోగ్యకరమైన, మరియు ఒత్తైన జుట్టు కావాలంటే పైన చెప్పినచిట్కాలను పాటించండి. చిన్న వయస్సు నుండే మీ జుట్టును జాగ్రత్తగా చూసుకోవడం వల్ల జుట్టు రాలడం, దెబ్బతినడం, సన్నబడటం నివారించవచ్చు. మీరు వంశపారంపర్యంగా లేదా ఇతర అంతర్లీన కారకాల వల్ల జుట్టు రాలడాన్ని ఎదుర్కొంటుంటే, వైద్యులని సంప్రదించండి.

ఈ పోస్ట్ మీకు సహాయకరంగా ఉందని ఆశిస్తున్నాము. మీకు ఇంకా ఏమైనా సందేహాలకు, ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీకు ఎటువంటి ఫలితాలు వచ్చాయో తెలియజేయడానికి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.

The post జుట్టు రాలడాన్ని అరికట్టడానికి ఇంటి చిట్కాలు మరియు చికిత్స – Hair Fall Tips and Treatment at Home in Telugu appeared first on STYLECRAZE.


Viewing all articles
Browse latest Browse all 2609

Trending Articles